Virat Kohli: కారణాలు చెప్పలేను, క్షమించమనలేను: విరాట్ కోహ్లీ

  • ఆర్సీబీ డబుల్ హ్యాట్రిక్ ఓటమి
  • దారుణాతి దారుణంగా మాత్రం ఆడలేదు
  • దురదృష్టం వెన్నాడిందన్న కోహ్లీ
ఈ ఐపీఎల్ సీజన్ లో డబుల్ హ్యాట్రిక్ పరాజయాన్ని ఎదుర్కొని, అభిమానులను తీవ్ర నిరాశలో పరిచి, ప్లే ఆఫ్ చాన్స్ ను దాదాపు వదిలేసుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. నిత్యమూ ఓటమికి కారణాలు చెప్పీ, చెప్పీ అలసిపోయానని, ఇక ఫ్యాన్స్ ను క్షమాపణలు కూడా అడగబోనని నిర్వేదంగా అన్నాడు.

మరోరోజు తమది కాకుండా పోయిందని, వచ్చిన అవకాశాలను వదిలేసుకున్నామని చెప్పాడు. ఈ సీజన్ లో తమ జట్టు దారుణాతి దారుణంగా మాత్రం ఆడలేదని, అయితే, అన్ని మ్యాచ్ లలోనూ దురదృష్టమే వెన్నాడిందని చెప్పుకొచ్చాడు. కాగా, నిన్న ఢిల్లీ కాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఆరో ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఆడిన ఆరు మ్యాచ్ లలో ఓడిపోయిన ఏకైక జట్టుగా ఆర్సీబీ నిలిచింది.
Virat Kohli
Loss
RCB
Fans

More Telugu News