Vijay Sai Reddy: ఈ నాలుగు రోజులూ వచ్చే వార్తలు ఇవే: విజయసాయి రెడ్డి!

  • ప్రజల్లో అనుమానాలు, భయాందోళనలు రేపుతారు
  • పోలింగ్ పూర్తయ్యేవరకూ వార్తలు పట్టించుకోవద్దు
  • బాధలు లేని జగనన్న రాజ్యం వస్తుందన్న విజయసాయి
రాబోయే నాలుగు రోజుల్లో ఎన్నో కుట్ర పూరిత కథనాలను ప్రజలు చదవాల్సి వస్తుందని, చూడాల్సి వస్తుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు కురిపించారు. ఈ ఉదయం తన ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "వచ్చే 4 రోజులు ఆంధ్రజ్యోతి, కులమీడియా ప్రజల్లో అనుమానాలు, భయాందోళనలు రేపే కుట్ర పూరిత వార్తలు ఇస్తాయి. కట్టుకథలతో చంద్రబాబుకు జోల పాడతాయి. పోలింగ్ పూర్తయ్యేదాకా ప్రజానీకం వీళ్ల ‘వశీకరణ’ వార్తలను పట్టించుకోవద్దని విజ్ణప్తి చేస్తున్నా. బాధలు, కష్టాలు లేని జగనన్న రాజ్యం వస్తోంది" అని వ్యాఖ్యానించారు.



Vijay Sai Reddy
Andhra Pradesh
Chandrababu
Media

More Telugu News