Tirumala: శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనం బంద్... టీటీడీ కీలక నిర్ణయం!

  • సిఫార్సు లేఖలను స్వీకరించరాదు
  • ప్రొటోకాల్ పరిధిలో ఉంటేనే బ్రేక్ దర్శనం
  • జూలై 14 వరకూ అమలు

మరో వారం రోజుల్లో ఇంటర్, టెన్త్ పరీక్షల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మిగతా అన్ని తరగతుల వారికీ పరీక్షలు ముగింపుదశకు వచ్చాయి. వచ్చే వారం నుంచి పాఠశాలలకు సెలవులు. పైగా వేసవి. ఈ సమయంలో తిరుమల భక్తులతో ఎలా కిటకిటలాడుతుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలన్న కృతనిశ్చయంతో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం, రద్దీని దృష్టిలో పెట్టుకుని, వారాంతంలో సిఫార్సు లేఖలు స్వీకరించరాదని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల్లో భక్తుల రాక అధికంగా ఉంటుంది కాబట్టి, ప్రొటోకాల్‌ పరిధిలోని వారికి మినహా మరెవరికీ వీఐపీ బ్రేక్‌ దర్శనం టిక్కెట్లు ఇవ్వరాదని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 16 నుంచి జులై 14వ తేదీ వరకు దీన్ని అమలు చేయనున్నామని టీటీడీ వెల్లడించింది.

More Telugu News