actor sivaji: కేసీఆర్ పోర్టును తరలించుకుపోతారన్న చంద్రబాబు ఆరోపణలపై శివాజీ వివరణ!

  • ఎన్నికల అఫిడవిట్‌లో జగన్ దాఖలు చేసిన సీబీఐ చార్జిషీట్లు ప్రదర్శన
  • వాన్‌పిక్ భూములపై కేసీఆర్ కన్ను
  • ప్రైవేటు పోర్టు కట్టుకోవాలని యోచన
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల చంద్రబాబు, మంత్రి లోకేశ్ మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వస్తే ఏపీ పోర్టును తెలంగాణకు తరలించుకుపోతారని చేసిన ఆరోపణలపై శివాజీ స్పందించారు. వీడియో ప్రదర్శనలో భాగంగా జగన్ ఇటీవల నామినేషన్ సందర్భంగా ఈసీకి సమర్పించిన తనపై ఉన్న కేసుల వివరాలను శివాజీ ప్రదర్శించారు. జగన్‌పై దాఖలైన అభియోగాలను ప్లే చేసిన శివాజీ రాజశేఖర్ రెడ్డి హయాంలో క్విడ్‌ప్రోకో ఎలా జరిగిందో వివరించారు. పక్క రాష్ట్రంలోని కేసీఆర్‌కు ప్రకాశం జిల్లాలోని 28 వేల ఎకరాల వాన్‌పిక్ భూములపై కన్నుపడిందని పేర్కొన్నారు.

రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఎకరం భూమిని నాలుగు వేల చొప్పున నిమ్మగడ్డ ప్రసాద్‌కు 28 వేల ఎకరాలు కేటాయించిందని పేర్కొన్నారు. ఈ వాన్‌పిక్ భూముల్లో కేసీఆర్ ఇప్పుడు ప్రైవేటు పోర్టు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారని, ఇది తన ఆరోపణ మాత్రమేనని స్పష్టం చేశారు. అక్కడ కేసీఆర్ ప్రైవేటు పోర్టు నిర్మించుకోవడం ద్వారా ఏపీ వాణిజ్య అవసరాలను దెబ్బకొట్టాలని చూస్తున్నారని, ఇది తన అభియోగం మాత్రమేనని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికిప్పుడు సాక్ష్యాలు ఇవ్వలేనని, ఇవి వచ్చినట్టుగానే అవి కూడా త్వరలోనే వస్తాయని శివాజీ పేర్కొన్నారు. వాన్‌పిక్ భూముల్లో పోర్టు కట్టుకోవాలనేది తెలంగాణ ముఖ్యమంత్రి బలమైన కోరికని శివాజీ తెలిపారు.
actor sivaji
Jagan
kcr
dry port
Telangana

More Telugu News