బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన శత్రుఘ్న సిన్హా
- హస్తం పార్టీలోకి శత్రుఘ్న సిన్హా
- బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం రోజే పార్టీకి వీడ్కోలు
- పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం నశించిందంటూ ఆగ్రహం
అయితే, ప్రస్తుతం బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం నశించిందని, అధినాయకత్వం చూస్తే వన్ మ్యాన్ షో, పార్టీ చూస్తే టు మెన్ షో అని పరోక్షంగా మోదీ, అమిత్ షాలను విమర్శించారు. గత పదేళ్లుగా పాట్నా సాహిబ్ నియోజకవర్గంలో శత్రుఘ్న సిన్హా పట్టు సాధించారు. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ అధినాయకత్వం ఆయనకు బదులు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను ఎంపీ అభ్యర్థిగా బరిలో దించింది. దాంతో, సిన్హా బీజేపీకి వీడ్కోలు పలికి కాంగ్రెస్ లో చేరారు.