Jagan: రెడ్డి, కమ్మ వర్గాలలో ఎందరో పేదలున్నారని తెలుసు... వారికి ఎవరూ చేయనంత సాయం చేస్తా!: జగన్ హామీ

  • రెండు వర్గాల్లోనూ ఎంతో మంది పేదలు
  • రెడ్లు కౌలు కూలీలుగా ఉన్నారు
  • కమ్మ వర్గం ప్రజలు అష్టకష్టాల్లో యన్నారు
  • అందరినీ ఆదుకుంటానన్న జగన్
అగ్రవర్ణాలుగా భావిస్తున్న రెడ్డి, కమ్మ వర్గాల్లోనూ ఎంతో మంది పేదలున్నారన్న సంగతి తనకు తెలుసునని, వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. ఎందరో రెడ్లు కౌలు కూలీలుగా పని చేస్తున్నారన్న విషయం తనకు తెలుసునని, వారి అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ తెలిపారు. కమ్మ వర్గం ప్రజలు అష్టకష్టాల్లో ఉన్నారని, వారి బిడ్డలను ఉన్నత చదువులు చదివించి, ప్రయోజకులను చేసే బాధ్యతను తాను తీసుకుంటానని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం భూమిని రీ సర్వే చేయించి, అసలైన యజమానులు ఎవరో ఆన్ లైన్లో ఉంచడం ద్వారా అక్రమాలకు తావులేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. రెడ్డి, కమ్మ వర్గాల్లో అట్టడుగున ఉన్న ప్రజలకు ఏ ప్రభుత్వమూ చేయనంత సాయం చేస్తానని జగన్ అన్నారు. 
Jagan
Reddys
Kammas

More Telugu News