Andhra Pradesh: జగన్ అసెంబ్లీకి రారు.. కోడికత్తి పార్టీకి ప్రజా సమస్యలు పట్టవు!: ఏపీ మంత్రి దేవినేని ఉమ

  • పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు సమయంలో చేపట్టాం
  • దీనివల్ల రైతులకు రూ.44 వేలకోట్ల లబ్ధి చేకూరింది
  • విజయవాడలో మీడియాతో టీడీపీ నేత
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈరోజు వైసీపీ అధినేత జగన్ పై విరుచుకుపడ్డారు. వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకే రారనీ, కోడి కత్తి పార్టీకి ప్రజా సమస్యలు పట్టవని వ్యాఖ్యానించారు. పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించి చరిత్ర సృష్టించామని తెలిపారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పట్టిసీమ ప్రాజెక్టు కారణంగా ఏపీలోని రైతులకు రూ.44,000 కోట్ల మేర లబ్ధి చేకూరిందని ఉమ పేర్కొన్నారు. అసెంబ్లీకి రాని వ్యక్తులకు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు. ఏపీలో టీడీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.
Andhra Pradesh
YSRCP
Jagan
devineni
uma

More Telugu News