Revanth Reddy: రేవంత్ వినూత్న ప్రచారం... మెట్రో రైల్లో మాస్క్ లతో యువత డ్యాన్స్... వీడియో!

  • మల్కాజ్ గిరి నుంచి బరిలో రేవంత్ రెడ్డి
  • ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న మార్గం
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్
తెలంగాణ పరిధిలోని మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న రేవంత్ రెడ్డి, ప్రచారంలో వినూత్న శైలిలో దూసుకెళుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన ఎంచుకున్న విభిన్న మార్గం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. రేవంత్ రెడ్డి మాస్క్ లు ధరించిన కొందరు యువకులు మెట్రో రైల్లో నృత్యాలు చేశారు. యువనేతకు ఓటేయాలని అభ్యర్థించారు. వివిధ కూడళ్లలోనూ వారు మాబ్ డ్యాన్స్ చేస్తూ స్థానికులను అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Revanth Reddy
Metro Rail
Youth
Dance

More Telugu News