ఈ సంవత్సరం జగన్ జాతకం ఎలా ఉందంటే..: ములుగు రామలింగేశ్వర వరప్రసాద్

06-04-2019 Sat 08:34
  • నెలాఖరు వరకూ శని మహర్దశ
  • బ్రహ్మయోగం, గజకేసరి యోగం ఉన్నాయి
  • రాజ్యాధికారం సాధించే అవకాశాలు పుష్కలమన్న ములుగు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్న వేళ, విపక్ష నేత వైఎస్ జగన్ జాతకాన్ని ప్రముఖ జ్యోతిష్య పండితుడు ములుగు రామలింగేశ్వర వర ప్రసాద్ విశ్లేషించారు. ఆయన జాతకంలో ఈ నెల 30 వరకూ శని మహర్ధశ ఉంటుందని, ఆపై బుధ మహర్దశ ప్రారంభమవుతుందని తెలిపారు.

 ఆయన ఆరుద్రా నక్షత్రం, కన్యాలగ్నంలో, మిథున రాశిలో జన్మించారని, శక్తిమంతమైన బ్రహ్మయోగం, గజకేసరి యోగం ఆయన జాతకంలో ఉన్నాయని అన్నారు. లగ్నదశమాధిపతి అయిన బుధుడు అతిక్రాంత యోగాన్ని అందివ్వనున్నారని, దీనివల్ల విశేష రాజయోగం రానుందని జోస్యం చెప్పారు. రాజ్యాధికారం సంపాదించాలంటే కావాల్సిన శని అనుగ్రహం విషయంలో జగన్ ముందున్నారని, ఆయన జాతకంలో శని పితృస్థానంలో ఉన్నారని అన్నారు.