Chandrababu: ‘సూపర్ చంద్రబాబు నాయుడు గారు’ అన్న వాళ్లే ‘సూపర్ డూపర్ వైఎస్సార్’ అనీ అన్నారు: హీరో రాజశేఖర్

  • హైటెక్ సిటీని చూసి చంద్రబాబును పొగిడారు
  • అద్భుత పథకాలు తెచ్చిన వైఎస్ఆర్ ను ఇంకా పొగిడారు
  • వైఎస్ మృతి తర్వాత జగన్ సీఎం కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవారు
నాడు చంద్రబాబు హయాంలో వచ్చిన హైటెక్ సిటీని చూసి ‘సూపర్ చంద్రబాబు నాయుడు గారు’ అన్న వాళ్లే, ‘ఆరోగ్యశ్రీ’ వంటి ఎన్నో అద్భుత పథకాలు తెచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ‘సూపర్ డూపర్ వైఎస్సార్’ అని ప్రశంసించారని వైసీపీ నాయకుడు, ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత సీఎం కావాలని జగన్ అనుకుని ఉంటే ఎప్పుడో అయ్యేవారని, కానీ, ఆయన అలా చేయలేదని, ఎన్నికల్లో నెగ్గి సీఎం కావాలని ఆయన అనుకున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ సినిమాలు చేస్తూ, అప్పుడప్పుడు రాజకీయాల గురించి ఆయన మాట్లాడుతుంటారని, జగన్ అలా కాదని, పదేళ్లుగా ప్రజలతోనే కలిసి ఉన్నారని చెప్పారు.
Chandrababu
Telugudesam
Ysr
cm
hero
Rajashekar

More Telugu News