Uttar Pradesh: మీ బయోపిక్ లో హీరోయిన్ ఎవరు? అని రాహుల్ ను ప్రశ్నించిన విద్యార్థి!

  • పూణే విద్యార్థులతో రాహుల్ ముఖాముఖి
  • గతంలో కాంగ్రెస్ తో తన వివాహమైపోయిందన్న రాహుల్
  • అమేథీ, వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అధినేత
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేశమంతా విస్తృతంగా పర్యటిస్తున్నారు. యూపీలోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ అన్నివర్గాలను ఆకట్టుకునేందుకు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పూణేలో విద్యార్థులతో రాహుల్ ఈరోజు ముఖాముఖి నిర్వహించారు. ప్రస్తుతం బయోపిక్ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో ఓ విద్యార్థి స్పందిస్తూ..‘రాహుల్.. మీ బయోపిక్ లో హీరోయిన్ గా ఎవరు నటించాలని కోరుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు.

దీనికి రాహుల్ జవాబిస్తూ..‘నా పనితోనే నేను ప్రేమలో పడ్డా. పనితోనే నాకు పెళ్లయిపోయింది’ అని వ్యాఖ్యానించారు. గతేడాది హైదరాబాద్ లో జర్నలిస్టులు ‘మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?’ అని రాహుల్ ను ప్రశ్నించారు. దీంతో ‘నేను కాంగ్రెస్ పార్టీని పెళ్లి చేసుకున్నా’ అని రాహుల్ జవాబిచ్చారు. రాహుల్ గాంధీ జీవితంపై ‘మై నేమ్ ఈజ్ రా..గా’ పేరుతో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు రూపేశ్ పాల్  దర్శకత్వం వహిస్తున్నారు.
Uttar Pradesh
Kerala
Rahul Gandhi
Congress
marriage
biopic

More Telugu News