బీజేపీ అధిష్ఠానాన్ని నిలదీస్తూ... కీలక ప్రకటన చేసిన సుమిత్రా మహాజన్
- లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటన
- ఇండోర్ కు ఇంతవరకు అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్న
- ఇప్పటి వరకు 8 సార్లు లోక్ సభకు ఎన్నికైన సుమిత్రా
వయసు పైబడిన నేతలను పోటీకి దూరంగా ఉంచాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే పార్టీ కీలక నేతలైన అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్లకు సైతం టికెట్ ఇవ్వలేదు. ఇదే విధంగా సుమిత్రకు కూడా టికెట్ ఇవ్వకపోవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. ఇదే సమయంలో పార్టీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ... ఇండోర్ కు ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు.