ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం!
- జిల్లాలోని శాంతినగర్ లో జాతీయ రహదారిపై ఘటన
- రోడ్డుపై ఆగిఉన్న లారీని బలంగా ఢీకొట్టిన కారు
- విశాఖపట్నం నుంచి తిరుపతికి వెళుతుండగా ప్రమాదం
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, అప్పటికే ముగ్గురు చనిపోయినట్లు నిర్ధారించిన వైద్యులు, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బాధిత కుటుంబం విశాఖ నుంచి తిరుపతికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చనిపోయినవారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.