గందరగోళంలో 'మందలగిరి' మాలోకాన్ని మించిపోయారు కదా!: పవన్ పై విజయసాయిరెడ్డి సెటైర్లు
- పవన్ ఏ రోటికాడ ఆ పాట పాడుతున్నారు
- ఆంధ్రవాళ్లను కొడుతున్నారంటూ ఇక్కడ చెబుతున్నారు
- ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘ఏ గట్టున ఉంటారో ఆయనకే తెలియదు. ఏ రోటికాడ ఆ పాట పాడేస్తున్నారు పవన్. ఆంధ్రా వాళ్ళను కొడుతున్నారంటూ ఆ గట్టుపై నిలబడి గగ్గోలు పెడతారు. తెలంగాణలో పుట్టి ఉంటే ఆంధ్రా వాళ్ళకు చుక్కలు చూపించేవాడినని ఈ గట్టున నిలబడి జబ్బులు చరుస్తారు. గందరగోళంలో మందలగిరి మాలోకాన్ని మించిపోయారు కదా!’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.