Khammam: ఖమ్మం ప్రచార సభలో చంద్రబాబుపై కేసీఆర్ పరోక్ష ప్రశంసలు!

  • సీతారామ ప్రాజెక్టు గురించి మాట్లాడిన కేసీఆర్
  • ఈ సందర్భంగా ‘పట్టిసీమ’ ప్రస్తావన
  • ఏపీలోని డెల్టా ప్రాంతాన్ని ‘పట్టిసీమ’ కాపాడింది

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఖమ్మంలో ఈరోజు నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణలోని సీతారామ ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన సందర్భంలో ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టుపై పరోక్షంగా ప్రశంసలు చేశారు. ఏపీలోని డెల్టా ప్రాంతాన్ని పట్టిసీమ ప్రాజెక్టు కాపాడిందని, అదే తరహాలో తెలంగాణలో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఇక్కడి రైతులకు అండగా ఉంటామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, పట్టిసీమ ప్రాజెక్టుపై వైసీపీ అధినేత జగన్ తరచుగా విమర్శలు చేస్తుంటారు. జగన్ కు మద్దతుగా నిలుస్తున్న కేసీఆర్ అదే ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించడం గమనార్హం.

  • Loading...

More Telugu News