Chandrababu: ​ మోదీ నీ వల్ల అయింది చేసుకో.. రాజశేఖర్ రెడ్డే ఏం చేయలేకపోయాడు!: చంద్రబాబు సవాల్

  • జగన్ సిగ్గులేకుండా కేసీఆర్ కు ఊడిగం చేస్తున్నాడు
  • నేను ఎవరికీ భయపడను
  • నా జీవితం తెరిచిన పుస్తకం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా పెదనందిపాడులో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రత్యర్థులు జగన్, మోదీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ సిగ్గులేకుండా కేసీఆర్ కు ఊడిగం చేస్తున్నాడంటూ మండిపడ్డారు.

"ఒక వ్యక్తి మీద కేసులుంటే కేసులకు భయపడతారా? లేక మీ ఊరి సమస్యలకు భయపడతారా? అలాంటి సందర్భాల్లో కేసులకే భయపడతారు కదా! కానీ, మన సమస్యల పట్ల మాట్లాడకుండా మోదీ కేసులు పెడతామంటున్నాడు. మోదీ నీ వల్ల అయింది చేసుకో, సవాల్ విసురుతున్నా! రాజశేఖర్ రెడ్డి అంతటివాడే ఏమీ చేయలేకపోయాడు. 26 కేసులు పెట్టాడు, ఏమైంది? మోదీ, నా జీవితం తెరిచిన పుస్తకం! అందుకే నేను ఎవరికీ భయపడను. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తిని నేను" అన్నారు చంద్రబాబు ఆవేశంగా. 
Chandrababu
Narendra Modi
Jagan
KCR

More Telugu News