KTR: ఏపీలో ఎవరెన్ని సీట్లు గెలుస్తారో చెప్పలేం కానీ, ఆయనకు రిటైర్‌మెంట్ మాత్రం ఖాయం: కేటీఆర్

  • మల్కాజ్‌గిరికి రేవంత్‌రెడ్డి ఏమైనా లోకలా?
  • నిజామాబాద్‌లో కచ్చితంగా గెలుస్తాం
  • ప్రచారం మానేసి ఇళ్లకు పరిమితమవుతున్నారు
  • టికెట్ ఇవ్వకుండా గొంతు కోశారనడం సరికాదు

ఏపీతో పాటు దేశ ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దేశంలో సంకీర్ణం రాబోతుందన్న ఆయన, ఏపీలో ఎవరెన్ని సీట్లు గెలుస్తారో చెప్పలేమని, అయితే సీఎం చంద్రబాబుకు మాత్రం రిటైర్‌మెంట్ ఖాయమని అన్నారు. వారణాసికి మోదీ, మల్కాజ్‌గిరికి రేవంత్‌రెడ్డి ఏమైనా లోకలా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఉన్నంత బలంగా మరే పార్టీ లేదని, లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ మరింత పతనమవుతుందన్నారు.

నిజామాబాద్‌లో కచ్చితంగా గెలుస్తామని, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం మానేసి ఇళ్లకు పరిమితమవుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నామా నాగేశ్వరరావు కోసం తీవ్రంగా ప్రయత్నించిన కాంగ్రెస్ చివరకు రేణుకా చౌదరి పేరును జాబితాలో చేర్చిందని పేర్కొన్నారు. టికెట్ ఇవ్వకుండా గొంతు కోశారని వివేక్ అనడం సరికాదని, పార్టీని అంటి పెట్టుకుని ఉంటే అవకాశాలు వస్తాయన్నారు. చేవెళ్ల ఒక మినీ ఇండియా అని, అక్కడ లోకల్, నాన్ లోకల్ అనేది వర్కవుట్ కాదని కేటీఆర్ పేర్కొన్నారు.

More Telugu News