PM Narendramodi: ‘పీఎం నరేంద్రమోదీ’ చిత్రం విడుదల వాయిదా!

  • రేపు విడుదల కావల్సిన ‘పీఎం నరేంద్రమోదీ’
  • వాయిదా కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్
  • సోమవారం నుంచి వాదనలు వింటామన్న కోర్టు

రేపు విడుదలకావల్సిన నరేంద్ర మోదీ బయోపిక్ ‘పీఎం నరేంద్రమోదీ’ వాయిదా పడింది. ఈ బయోపిక్‌ విడుదలను వాయిదా వేస్తున్నట్టు నిర్మాత సందీప్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎన్నికల సమయంలో ఈ సినిమా విడుదలైతే ఓటరుపై ప్రభావం చూపే అవకాశం ఉందని, కాబట్టి ఆ సినిమా విడుదలను వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత ఒకరు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు సోమవారం నుంచి వాదనలు వింటామని తెలిపింది. ‘పీఎం నరేంద్రమోదీ’ చిత్రాన్ని ఈ నెల 5న విడుదల చేయాలని భావించామని, కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్టు సందీప్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

More Telugu News