Sharmila: ఈ పప్పు గారికి జయంతికి, వర్ధంతికి తేడా తెలీదు: షర్మిల

  • ఉంగుటూరులో ప్రచారం
  • టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీయండంటూ పిలుపు
  • ప్రతి వర్గానికి మేలు చేసిన సీఎం వైఎస్సారే!
వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా ఉన్నారు. ఆమె ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చంద్రబాబు మళ్లీ ప్రజల చెవిలో పూలు పెట్టేందుకు వస్తున్నాడంటూ వ్యాఖ్యానించారు.

"చెవిలో క్యాబేజీలు, పూలు పెట్టేందుకు మళ్లీ వస్తున్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి తన కొడుక్కే మూడు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. మూడు శాఖలకు మంత్రిని చేశాడు కానీ, ఆ పప్పు గారికి జయంతికి, వర్ధంతికి తేడా తెలీదు. కనీసం ఓనమాలు కూడా రాకపోయినా అందలం ఎక్కించారు. ఒక్క ఎన్నికలో అయినా గెలిచాడా? దీన్ని పుత్ర వాత్సల్యం అంటారో, మరేం అంటారో చంద్రబాబే చెప్పాలి. అందరి బాధ్యత తనదే అంటున్నారు, కానీ పప్పు గారి బాధ్యతే ఆయన బాధ్యత" అంటూ షర్మిల విమర్శలు చేశారు. ఇచ్చిన హామీల పట్ల టీడీపీ సర్కారును నిలదీయాలని, ప్రతి వర్గానికి మేలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్సార్ మాత్రమేనని ఉద్ఘాటించారు.
Sharmila
YSRCP
Jagan
Chandrababu
Nara Lokesh
Telugudesam

More Telugu News