Guntur District: ఏపీకి ఐదు లక్షల కోట్లకు పైగా నిధులిచ్చాం: అమిత్ షా

  • డెబ్బై ఏళ్లలో ఏ ప్రభుత్వమూ ఇన్ని నిధులు ఇవ్వలేదు
  • ఏపీలో 20కి పైగా కేంద్ర సంస్థలు ఏర్పాటయ్యాయి
  • విభజన సమయంలో చెప్పిన 14 అంశాల్లో 11 పూర్తి చేశాం

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీకి రూ.5 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చిందని, గడచిన డెబ్బై ఏళ్లలో ఏ ప్రభుత్వమూ ఇన్ని నిధులు ఇవ్వలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సమయంలో చెప్పిన 14 అంశాల్లో 11 పూర్తి చేశామని, ఏపీలో 20కి పైగా కేంద్ర సంస్థలు ఏర్పాటయ్యాయని అన్నారు.

విశాఖ రైల్వేజోన్ హామీని మోదీ ప్రభుత్వం నిలబెట్టుకుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. చంద్రబాబు లాంటి అవకాశవాద నేత దేశంలో మరొకరు లేరని, మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తే తమతో కలవాలని చంద్రబాబు ఆలోచన చేసినా ఆశ్చర్యం లేదని అన్నారు. అయితే, తాము మాత్రం చంద్రబాబును మళ్లీ ఎన్డీఏలోకి రానివ్వమని వ్యాఖ్యానించారు. అమరావతి పేరిట అవినీతి తప్ప ఒక్క నిర్మాణమూ జరగలేదని విమర్శించారు.

More Telugu News