తిరుమల కూడా చెప్పులతోనే వెళతారు, తానేదో మహానుభావుడ్ని అనుకుంటారు: జగన్ పై పవన్ విసుర్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమల కూడా చెప్పులతోనే వెళతారు, తానేదో మహానుభావుడ్ని అనుకుంటారు: జగన్ పై పవన్ విసుర్లు

  • జగన్ లో అహం పోవాలి
  • వీళ్లకు ఊడిగం చేస్తేనే బతకనిస్తారా?
  • తిరుపతి సభలో జనసేనాని విమర్శలు
జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్ లో అహం పోవాలని అన్నారు. జగన్ తిరుమలకు చెప్పులేసుకుని వెళతారని, ప్రోటోకాల్ పాటించరని మండిపడ్డారు. తానేదో మహానుభావుడ్ని అన్నట్టుగా జగన్ భావిస్తుంటారని పవన్ ఆరోపించారు. దళితులను వాడుకుని వదిలేసే వారిని నమ్మొద్దని, వైసీపీ వంటి పార్టీకి బుద్ధి చెబితేనే దళితులకు సరైన న్యాయం జరుగుతుందని జనసేనాని అభిప్రాయపడ్డారు.

జగన్ మనుషులకు విలువ ఇవ్వరని, సీమలో వారి ఇళ్ల మధ్య నుంచి ఎవరైనా వెళ్లాలంటే నేటికీ చెప్పులు చేతపట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. వైసీపీ నేతలు వాళ్ల కుటుంబాలు బాగుంటే సరిపోతుందని భావిస్తున్నారని, ఇకపై వాళ్లు ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. వీళ్లకు ఊడిగం చేస్తేనే బతకనిస్తారా? అంటూ పవన్ ఆగ్రహం ప్రదర్శించారు. దళితులు ఇకనైనా మేల్కొని వైసీపీకి మద్దతివ్వడం మానేయాలని పిలుపునిచ్చారు.
Pawan Kalyan
Jagan

More Telugu News