ఆ స్టార్ హీరోల విజయరహస్యం అదే: రకుల్

  • తెలుగు సినిమాలే నన్ను నిలబెట్టాయి
  •  ఆ తెలుగు హీరోలు గొప్ప డాన్సర్లు
  • వాళ్లు ఎంతకష్టమైనా పడతారు     
 ఒక వైపున తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్, మరో వైపున హిందీలోను తన దూకుడును పెంచడానికి సిద్ధమవుతోంది. తమిళ .. హిందీ భాషలకి సంబంధించిన సినిమాల్లో ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నప్పటికీ, ఈ స్థాయివరకూ తనని నడిపించింది తెలుగు సినిమాలేనని ఆమె చెప్పింది.

తెలుగులో ఎన్టీఆర్ .. చరణ్ .. అల్లు అర్జున్ గొప్ప డాన్సర్లనీ, వాళ్లతో కలిసి డాన్స్ చేయడం చాలా కష్టమని అంది. 'మీ శరీరంలో ఎముకలు లేవా?' అని నేను వాళ్లతో సరదాగా జోక్ చేస్తూ ఉంటానని చెప్పింది. స్టార్ హీరోలైనప్పటికీ వాళ్లు ఎంతో సింపుల్ గా వుంటారనీ .. ఏ సీన్ అయినా అనుకున్నట్టుగా వచ్చేంతవరకూ కష్టపడుతూ ఉంటారని అంది. వాళ్ల విజయ రహస్యం అదేననే విషయం దగ్గర నుంచి చూసిన తరువాతనే తనకి తెలిసిందని తెలిపింది. హిందీలో 'దే దే ప్యార్ దే' .. తమిళంలో 'ఎన్జీకే' సినిమాలు చేసిన ఆమె, తెలుగులో 'మన్మథుడు 2' చేస్తోంది.  
Go Back to Shorts
rakul

More Telugu News