'రాక్షసుడు' గా బెల్లంకొండ శ్రీనివాస్?
- తమిళంలో సక్సెస్ అయిన 'రాచ్చసన్'
- రమేశ్ వర్మ దర్శకత్వంలో రీమేక్
- టైటిల్ విషయంలో కసరత్తు
ఈ సినిమాకి తెలుగులో 'రాక్షసుడు' అనే టైటిల్ ను ఖరారు చేయాలనే ఆలోచనలో రమేశ్ వర్మ వున్నాడు. గతంలో చిరంజీవి హీరోగా 'రాక్షసుడు' వచ్చింది. ఆ మధ్య సూర్య అనువాద చిత్రం కూడా 'రాక్షసుడు' టైటిల్ తో తెలుగులోకి వచ్చింది. మళ్లీ ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకి అదే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే .. ఈ టైటిల్ ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రంగా ఈ నెలలో 'సీత' సినిమా రానున్న సంగతి తెలిసిందే.