టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2009లో వంశీపై ఆయుధాల చట్టం కింద నమోదైన కేసుకు సంబంధించి హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. గతంలో తనకు ప్రభుత్వ రక్షణ వద్దంటూ ప్రైవేట్ భద్రతను వంశీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో వంశీ వద్ద అక్రమ ఆయుధాలు లభించాయని ఆయనపై అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు వంశీ హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది. 
Go Back to Shorts
Andhra Pradesh
gannavaram
Telugudesam
vallabhaneni

More Telugu News