KCR: రైతుబంధు మొత్తాన్ని రూ.8 వేల నుంచి 10 వేలకు పెంచుతున్నా: కేసీఆర్

  • పథకాలను చూసి దేశమే ఆశ్చర్యపోతోంది
  • ఎన్నో పథకాలను ప్రవేశపెట్టా
  • మిషన్ భగీరథ పూర్తికావొచ్చింది

రైతుబంధు పథకం కింద ఇచ్చే మొత్తాన్ని రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచనున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. నేడు ఆయన జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, రైతుబంధుతో పాటు రైతు బీమా పథకాలు చూసి దేశమే ఆశ్చర్యపోతోందన్నారు.

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎన్నో ప్రవేశపెట్టానని, మిషన్ భగీరథ పథకం దాదాపు పూర్తికావొచ్చిందని తెలిపారు. ఐదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో చూడాలన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ లక్ష ఎకరాలకు నీరిస్తామని, వచ్చే రెండేళ్లలో సాగునీరు అందిస్తామని తెలిపారు. రూ.80 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు కేసీఆర్ స్పష్టం చేశారు.

More Telugu News