lakshmis ntr: ఏపీలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలకు మరోసారి అడ్డంకి.. పిటిషన్ విచారణను వాయిదా వేసిన హైకోర్టు!

షార్ట్స్‌లో చూడండి
సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఏపీలో తప్ప, మిగిలిన అన్ని ప్రాంతాల్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని.... ఈ చిత్రం విడుదలైతే ఏపీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని టీడీపీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, ఏపీలో ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదల కాలేదు.

ఈ క్రమంలో, ఈ చిత్రం విడుదలకు సంబంధించి పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈ రోజు విచారించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నందువల్ల దీనిపై ఇప్పటికిప్పుడే విచారణ జరపలేమని తెలిపింది. ఈ సినిమా ప్రివ్యూని కూడా ఇప్పుడు చూడలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది. దీంతో, ఏపీలో ఈ సినిమా విడుదలకు మళ్లీ బ్రేక్ పడినట్టైంది.
Go Back to Shorts
lakshmis ntr
high court
Andhra Pradesh
tollywood

More Telugu News