Chandrababu: అదిరిందయ్యా చంద్రం... తథాస్తు దేవతలు ఉన్నారు... మీ కోరిక నెరవేరినట్టే: కన్నా

షార్ట్స్‌లో చూడండి
చంద్రబాబు కోరికను తథాస్తు దేవతలు విన్నారని, ఆయన శాశ్వతంగా మనవడితో ఆడుకునే అవకాశాన్ని ఇవ్వబోతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. నిన్న ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ, తనకు పదవిపోతే, భార్య, కుమారుడు, మనవడు ఉన్నారని, మోదీకి ఎవరున్నారని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

బాబు వ్యాఖ్యలపై సెటైర్ వేసిన కన్నా, "అదిరిందయ్య చంద్రం..! ఇన్నాళ్లకు మీ 40 ఏళ్ల అనుభవంతో  మీ భవిష్యత్తుని సరిగ్గా అంచనా వేసుకున్నారు.. తథాస్తు దేవతలు తప్పక మీ కోరిక నెరవేరుస్తారు. మీ విషయంలో ప్రజలు కూడా అదే భావనతో ఉన్నారు.. మరో వారం తరవాత శాశ్వతంగా మీరు మనవడితో పూర్తి సమయం ఆడుకునే అవకాశం ఇవ్వబోతున్నారు" అని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
kanna Lakshminarayana
Twitter
Narendra Modi

More Telugu News