Jaish-e-Mohammad: దుబాయ్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాదిని కస్టడీలోకి తీసుకున్న భారత్

  • 2017 డిసెంబరు 30-31 మధ్య సీఆర్‌పీఎఫ్ సైనిక స్థావరంపై దాడి
  • అమరులైన ఐదుగురు జవాన్లు
  • దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి జైషే ఉగ్రవాది

డిసెంబరు 2017లో జమ్ముకశ్మీర్‌లోని లెత్‌పొరాలో సీఆర్‌పీఎఫ్ స్థావరంపై దాడికి పథక రచన చేసిన జైషే ఉగ్రవాది నిసార్ అహ్మద్ తాంత్రేను యూఏఈలో భారత్ అదుపులోకి తీసుకుంది. 2017 డిసెంబరు 30, 31 మధ్య సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై జరిగిన దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది అమరులు కాగా, ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు.

దక్షిణ కశ్మీర్ జైషే డివిజనల్ కమాండర్ నూర్ తాంత్రే సోదరుడైన నిసార్.. సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై దాడికి పథక రచన చేశాడు. కేవలం నాలుగు అడుగులు మాత్రమే ఉండే నిసార్‌కు జైషేలో ప్రత్యేక గుర్తింపు ఉంది. దుబాయ్‌లో ఇతడిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక విమానంలో ఆదివారం ఢిల్లీకి తీసుకొచ్చారు. అనంతరం ఎన్ఐఏకు అప్పగించారు. నిసార్ సోదరుడు నూర్ 2017లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

More Telugu News