Jandhan accounts: జన్‌ధన్ ఖాతాల్లోకి వచ్చిపడుతున్న డబ్బు.. ఉత్తరప్రదేశ్‌లో కలకలం

  • కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న సొమ్ము
  • 1700 ఖాతాల్లో రూ. 10 వేల చొప్పున జమ
  • రంగంలోకి ఆదాయపు పన్ను శాఖ అధికారులు
ఉత్తరప్రదేశ్‌లోని జన్‌ధన్ ఖాతాల్లోకి డబ్బులు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతోంది. వందలకొద్దీ ఖాతాల్లో పదేసివేల చొప్పున డబ్బు డిపాజిట్ అవుతోంది. ఎక్కడి నుంచి ఆ డబ్బులు వచ్చిపడుతున్నాయో తెలుసుకునేందుకు ఎన్నికల అధికారులు నిఘా పెట్టారు. మొరాదాబాద్ జిల్లాలోని 1700 జన్‌ధన్ ఖాతాల్లో ఇలా సొమ్ము జమ అయినట్టు అధికారులు గుర్తించారు. మొత్తం రూ.1.7 కోట్లు ఆయా ఖాతాల్లో జమ అయింది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో ఓటర్లను ఆకర్షించేందుకు నాయకులే ఈ సొమ్మును జమ చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. రంగంలోకి దిగిన ఆదాయపు పన్నుశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Jandhan accounts
Uttar Pradesh
Moradabad
IT
Election commission

More Telugu News