TRS: ప్రధాని కేసీఆర్, సీఎం కేటీఆర్: మహమూద్ అలీ జోస్యం

  • ప్రాంతీయ పార్టీలదే హవా
  • వారి అభ్యర్థులే గెలవనున్నారు
  • కేంద్రంలో కీలకం కానున్న టీఆర్ఎస్
ఈ సార్వత్రిక ఎన్నికల తరువాత దేశ ప్రధానిగా కేసీఆర్‌, తెలంగాణ సీఎంగా కేటీఆర్‌ ఉండే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ హోమ్ మంత్రి మహమూద్‌ అలీ వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్‌ లో ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆయన, లోక్ సభ ఎన్నికల తరువాత, టీఆర్ఎస్ ఎంతో కీలకం కానుందని జోస్యం చెప్పారు.

ఎన్నో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోందని, కాంగ్రెస్‌, బీజేపీల పని అయిపోయిందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక ఎంపీలు ప్రాంతీయ పార్టీల వారే ఉంటారని అంచనా వేసిన ఆయన, కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కేసీఆర్‌ దే ముఖ్య పాత్రని అన్నారు. ఇటీవల కొందరు కశ్మీర్ ప్రముఖులు తనను కలిశారని, కేసీఆర్ పీఎంగా ఉంటే కశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారని అన్నారు.
TRS
Mahamood Ali
KCR
PM

More Telugu News