విదేశీ యువతులతో వ్యభిచారం... హైదరాబాద్ లో 11 మంది అరెస్ట్!
- స్టార్ హోటళ్లలో వ్యభిచారం
- పట్టుబడిన నలుగురు విదేశీ యువతులు
- పరారీలో నిర్వాహకులు
దీంతో ఎస్సార్ నగర్ పోలీసులు దాడులు చేయగా, ఇద్దరు యువతులు పట్టుబడ్డారు. ఇదే సమయంలో పంజాగుట్టలోని పోలో లాడ్జిపైనా ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ ఉజ్బెకిస్థాన్ కు చెందిన నలుగురు యువతులు, బెంగాల్ కు చెందిన యువతి, నలుగురు విటులు పట్టుబడ్డారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో నిర్వాహకులు పారిపోయారని తిరుపతన్న తెలిపారు. రాహుల్, సూర్య అనే ఇద్దరు వ్యక్తులు ఈ దందా నిర్వహిస్తున్నారని, వారి కోసం గాలిస్తున్నామని అన్నారు.