Telangana: ఈ ఎన్నికల్లో చైతన్యవంతమైన తీర్పు ఇవ్వాలి: తెలంగాణ సీఎం కేసీఆర్

  • ‘కాంగ్రెస్’ అభ్యర్థులు గెలిస్తే రాహుల్ కు బానిసలు
  • బీజేపీ అభ్యర్థులు గెలిస్తే మోదీకి బానిసలు
  • టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే తెలంగాణ అభివృద్ధి  

ఈ ఎన్నికల్లో చైతన్యవంతమైన, స్ఫూర్తివంతమైన తీర్పు ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. వరంగల్ లోని అజాం జాహి మిల్స్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణ ఎలా ఉండేది? ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందో ఆలోచించాలని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తక్కువ సమయంలో అన్నీ బాగు చేసుకున్నామని, ప్రతీ రంగంలో గుణాత్మకమైన మార్పులు వచ్చాయని చెప్పారు.

వరంగల్ జిల్లాకు త్వరలో 100 టీఎంసీల నీరు ఇస్తామని, ఎస్సారెస్పీ కాలువలకు మరమ్మతులు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలను తికమక పెట్టేందుకు మోదీ, రాహుల్ గాంధీలు చూస్తున్నారని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.  మోదీ, రాహుల్ గెలిస్తే దేశం ఏమైనా మారుతుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే రాహుల్ కు బానిసలుగా, బీజేపీ అభ్యర్థులు గెలిస్తే మోదీకి బానిసలుగా ఉంటారని, అదే, టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్నారు. అందుకే, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నానని కేసీఆర్ కోరారు.

More Telugu News