Dimuth Karunaratne: మందు కొట్టి కారు నడుపుతూ యాక్సిడెంట్... కష్టాల్లో శ్రీలంక టెస్ట్ కెప్టెన్ దిముత్ కరుణరత్నె!

  • కష్టాల్లో పడిన దిముత్ కరుణరత్నె
  • ఆటోను ఢీకొట్టిన టెస్ట్ జట్టు కెప్టెన్
  • వారంలో కోర్టుకు హాజరు పరిచే అవకాశం

శ్రీలంక క్రికెట్ టెస్ట్ జట్టు కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నె కష్టాల్లో పడ్డాడు. మందు కొట్టి వాహనం నడుపుతూ వెళ్లి, ఓ ఆటోను ఢీకొట్టాడు. తెల్లవారుజామున 5.40 గంటలకు కొలంబోలో ఈ ఘటన జరుగగా, కరుణరత్నెను పోలీసులు అరెస్టు చేసి, ఆపై బెయిల్ మీద విడుదల చేశారు. మరో వారం రోజుల్లో కరుణరత్నెను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతనికి ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు. ఈ అరెస్టుతో దిముత్ క్రికెటర్ కెరీర్ ప్రభావితం కావచ్చని అంచనా. కాగా, గడచిన ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ లో కరుణరత్నె కెప్టెన్సీలో శ్రీలంక అద్భుత విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. టెస్ట్ ల్లో విజయంతో వన్డేలు, టీ-20లకూ అతన్నే కెప్టెన్ గా నియమించాలన్న డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఇలా పోలీసు కేసులో ఆయన చిక్కుకోవడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News