Chandrababu: కేటీఆర్... ఎవరున్నారు నీ ఫెడరల్ ఫ్రంట్ లో?... తుక్కు ఫెడరల్ ఫ్రంట్ నీది!: చంద్రబాబు

  • ఉన్నదల్లా మోదీ ఫ్రంట్ మాత్రమే
  • మమతా మా పక్షానే ఉన్నారు
  • ఆమె మా సభకు వస్తున్నారు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాయకరావుపేట రోడ్ షోలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఎప్పట్లానే జగన్, కేసీఆర్, మోదీ త్రయాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శల జడివాన కురిపించారు. కేసీఆర్, కేటీఆర్ తరచుగా ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడుతుండడాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. "కేటీఆర్ నిన్న కూడా అంటాడు... జగన్ తమ పక్షానే నిలిచి ఫెడరల్ ఫ్రంట్ లోకి వస్తాడట! కేంద్రంలో ఉన్న పియూష్ గోయల్ కూడా అదే మాట చెబుతాడు. ఫెడరల్ ఫ్రంట్ పెడతారట! ఎక్కడుందీ ఫెడరల్ ఫ్రంట్? ఇదో తుక్కు ఫెడరల్ ఫ్రంట్! ఎవరున్నారు ఈ ఫ్రంట్ లో? మమతా కూడా మా పక్షాన ఉన్నారు. ఆమె మన మీటింగ్ కు వస్తుంటే ఆమెతో కూడా కలిసి పనిచేస్తామని చెబుతారీ మోసకారులు. ఉన్నదల్లా మోదీ ఫ్రంట్ మాత్రమే. అందులో ఉండేది వీళ్లే!"  అంటూ విమర్శించారు.
Chandrababu
KTR
KCR

More Telugu News