mahabubnagar: మా ఎంపీ అభ్యర్థి ‘మన్నెం’ భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నాడు: సీఎం కేసీఆర్

  • రెండున్నర నుంచి మూడు లక్షల భారీ మెజార్టీ ఖాయం
  • ప్రజలు నిజాయతీ వైపు ఉండాలి
  • ఐదేళ్లలో దేశానికి మోదీ ఏం చేశారో చెప్పాలి
రెండున్నర నుంచి మూడు లక్షల భారీ మెజార్టీతో తమ పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నెం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించబోతున్నారని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు ప్రచారం చేసుకుంటాయని, అయితే, వాళ్లు చెప్పే మాటలు ఎంతవరకు వాస్తవమో గ్రహించాలని, ప్రజలు నిజాయతీ వైపు ఉండాలని సూచించారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మహబూబ్ నగర్ జిల్లాను కరవు జిల్లాగా మార్చారని దుయ్యబట్టారు. నిన్న తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ చాలా పెద్ద మాటలు మాట్లాడారని విమర్శించారు. ఐదేళ్ల నుంచి ప్రధానిగా ఉన్న మోదీ దేశానికి ఏం చేశారో చెప్పి ప్రజలను ఓట్లు అడగాలని అన్నారు.
mahabubnagar
TRS
kcr
election

More Telugu News