Facebook: ఫేస్ బుక్ నుంచి కొత్త ఫీచర్లు... ఫ్రెండ్స్, వై-ఫై ఎక్కడున్నా పట్టేయొచ్చు!

  • 'నియర్ బై ఫ్రెండ్స్', 'ఫైండ్ వైఫై' పేరుతో ఫీచర్లు
  • ఎఫ్ బీ మొబైల్ యాప్ యూజర్లకు ఉపయుక్తం
  • కొత్త ఫీచర్లు ప్రవేశపెట్టిన సోషల్ మీడియా దిగ్గజం

సోషల్ మీడియా రంగంలో తిరుగులేని స్థానంలో ఉన్న ఫేస్ బుక్ తన మొబైల్ యూజర్ల కోసం సరికొత్తగా రెండు ఫీచర్లు తీసుకువచ్చింది. 'నియర్ బై ఫ్రెండ్స్', 'ఫైండ్ వైఫై' అనే ఈ రెండు ఫీచర్ల ద్వారా యూజర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఫేస్ బుక్ వర్గాలు పేర్కొన్నాయి. 'నియర్ బై ఫ్రెండ్స్' అనే ఫీచర్ ను యూజర్లు తమ స్మార్ట్ ఫోన్లలో యాక్టివేట్ చేసుకున్నప్పుడు వారికి సమీపంలో ఉన్న ఫేస్ బుక్ ఫ్రెండ్స్ వివరాలు స్క్రీన్ పై ప్రత్యక్షం అవుతాయి.

ఓ యూజర్ తన ఫోన్ లో 'నియర్ బై ఫ్రెండ్స్' ఆప్షన్ ను యాక్టివేట్ చేసి తాను తెలుసుకోవాలనుకుంటున్న వ్యక్తిని యాడ్ చేయాలి. అదే సమయంలో ఆ ఫ్రెండ్ కూడా తన ఫోన్ లో ఇదే ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు, ఆ స్నేహితుడు మనకు దగ్గర్లో ఉంటే వారి వివరాలు స్క్రీన్ పై దర్శనమిస్తాయి.

ఇక, 'ఫైండ్ వైఫై' ఆప్షన్ కూడా ఇలాంటిదే. ఈ ఫీచర్ ను క్లిక్ చేయగానే, మనకు దగ్గర్లో ఉన్న వైఫై, హాట్ స్పాట్ డీటెయిల్స్ అన్నీ అరచేతిలో ప్రత్యక్షమవుతాయి. ఫేస్ బుక్ యాప్ లోని మోర్ అనే ఆప్షన్ కింద 'ఫైండ్ వైఫై' ఫీచర్ ను పొందుపరిచారు.

More Telugu News