Andhra Pradesh: తెనాలి అభివృద్ధికి ఐదేళ్లలో రూ.960 కోట్లు ఖర్చుపెట్టాను!: టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్

  • 1,051 మందికి చంద్రన్న బీమా కల్పించాం
  • 20 వేల మంది రైతులకు రుణమాఫీ చేశాం
  • తెనాలిలో మీడియా సమావేశం ఏర్పాటుచేసిన ఆలపాటి

గత ఐదేళ్లలో తెనాలి నియోజకవర్గం అభివృద్ధి కోసం రూ.960 కోట్లు ఖర్చు చేశామని టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి తెనాలిలో చోటుచేసుకుందన్నారు. తెనాలిలో రూ.37.5 కోట్లతో మసీదుల నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. రూ.35.6 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేశామనీ, నిరంతర విద్యుత్ ను అందజేస్తున్నామని పేర్కొన్నారు. తెనాలిలోని 1,051 మంది ప్రజలకు రూ.12.48 కోట్లతో చంద్రన్న బీమాను కల్పించామన్నారు.

తెనాలిలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటుచేసిన రాజేంద్రప్రసాద్.. తాను చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 826 మంది ప్రజలను ఆదుకున్నామనీ, వీరికి రూ.5.75 కోట్ల లబ్ధి చేకూర్చామని తెలిపారు. నియోజకవర్గంలో 56,000 మందికి పసుపు-కుంకుమ పథకం కింద నగదును అందజేశామనీ, దాదాపు 29,000 మందికి పింఛన్లు ఇస్తున్నామని ఆలపాటి రాజేంద్రప్రసాద్ చెప్పారు. తెనాలిలో రూ.122.86 కోట్లతో 20,000 మంది రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ సేవ చేసుకుంటున్న తనకు మళ్లీ ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News