హిందీ రీమేక్ దిశగా 'ఎఫ్ 2'
- తెలుగులో హిట్ కొట్టిన 'ఎఫ్ 2'
- హిందీ రీమేక్ పై దృష్టి పెట్టిన దిల్ రాజు
- మరో నిర్మాతగా బోనీ కపూర్
తెలుగులో ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు, హిందీలో రీమేక్ చేయడానికి రంగంలోకి దిగారు. హిందీలో బోనీకపూర్ తో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. దర్శకుడిగా అనీస్ బజ్మీని తీసుకున్నారు. ఈ సినిమాకి పనిచేయనున్న సాంకేతిక నిపుణుల గురించి .. నటీనటులను గురించి త్వరలోనే తెలియనుంది.