దీపికా పదుకొనెకు జోడీగా నన్నెవరూ తీసుకోవడం లేదు!: సల్మాన్ ఖాన్
- ఇంతవరకూ దీపికతో చేయని సల్మాన్
- ఏదో సినిమా రాసి పెట్టే ఉంటుందన్న దీపిక
- నా కంటే ఆమె పెద్ద స్టారన్న సల్మాన్
ఇదే విషయాన్ని దీపిక దగ్గర ప్రస్తావిస్తే .. "మేమిద్దరం కలిసి ఇంతవరకూ నటించలేదంటే .. భవిష్యత్తులో మా కోసం ప్రత్యేకమైన సినిమా ఏదో రాసిపెట్టి ఉందని నమ్ముతున్నాను" అని చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయాన్ని గురించి సల్మాన్ ను అడిగితే, "నాతో నటించడానికి దీపికకి సమయం ఉండాలి కదా .. నాకంటే ఆమె పెద్ద స్టార్ .. అందుకే ఆమె జోడీగా నన్ను ఎవరూ తీసుకోవడం లేదేమో" అంటూ చమత్కరించారు. తాను చేయనున్న మూడు సినిమాల్లోను హీరోయిన్స్ ను తీసేసుకున్నారనీ, ఆ తరువాత సినిమాను దీపికతో చేయవచ్చునేమోనని సమాధానమిచ్చారు.