sai sanjana: ఏపీ ఎన్నికల బరిలో సినీ నటి సాయి సంజన

  • న్యూజివీడు నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న సంజన
  • కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి.. విఫలం
  • 2016లో మిస్ హైదరాబాదుగా ఎంపికైన సంజన
ఏపీ ఎన్నికల బరిలో మరో సెలబ్రిటీ నిలబడింది. బిగ్ బాస్-2 పార్టిసిపెంట్, సినీ నటి సాయి సంజన నూజివీడు శాసనసభ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసింది. ఆమె సొంత ఊరు నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలంలోని కృష్ణవరం. ఆమె అసలు పేను వనజ. ఆమె త్రండ్రి ధనకోటేశ్వరరావు రైతు.

2016లో సంజన మిస్ హైదరాబాదుగా ఎంపికైంది. సినీపరిశ్రమలోకి వెళ్లిన తర్వాత జనజాగృతి అనే రాజకీయ పార్టీలో ఆమె చేరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఆమె ప్రయత్నించినా, ఆమెకు టికెట్ దక్కలేదు. దీంతో, స్వతంత్ర అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగారు. మాజీ మంత్రి, దివంగత పాలడుగు వెంకట్రావుకు ఆమె సమీప బంధువు.
sai sanjana
actress
tollywood
bigboss
nuziveedu
elections

More Telugu News