charan raj: ప్రభాస్ సినిమాలో చేసే ఛాన్స్ వస్తే అంతకన్నా అదృష్టం లేదు: సీనియర్ నటుడు చరణ్ రాజ్
- కృష్ణంరాజు గారు మనసున్న మనిషి
- ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం
- నా దృష్టిలో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్
తెలుగు తెరపై నిన్నటి తరం కథానాయకులతో తలపడిన ప్రతినాయకుడిగా చరణ్ రాజ్ కనిపిస్తాడు. తనదైన నటనతో మెప్పించిన ఆయనను తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అలాంటి చరణ్ రాజ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. 'పల్నాటి పౌరుషం' సినిమాలో కృష్ణంరాజు గారితో కలిసి నటించాను. ఆ సినిమా నుంచే ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సినిమా షూటింగు జరిగినన్ని రోజులు ఆయన ఇంటి నుంచే భోజనం వచ్చేది.
అలాంటి కృష్ణంరాజు గారు తన సొంత బ్యానర్ పై మళ్లీ సినిమా చేస్తున్నట్టుగా విన్నాను. ప్రభాస్ తో ఆయన చేసే ఆ సినిమాలో నాకు తప్పకుండా వేషం వుంటుందని భావిస్తున్నాను. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం .. నా దృష్టిలో ఆయన ఇంటర్నేషనల్ స్టార్. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే చాలు .. అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు" అని ఆయన తన మనసులో మాట చెప్పుకొచ్చారు.