bjp: ఈ 6 రాష్ట్రాల్లో బీజేపీకి కేవలం 5 నుంచి 10 సీట్లు మాత్రమే వస్తాయి: మమతా బెనర్జీ జోస్యం

  • బీజేపీకి 200 మించి సీట్లు రావు
  • కనిష్ఠంగా 135 సీట్లకే పరిమితం కావచ్చు
  • ఎన్నికల ఫలితాలపై నివేదికను చదివి వినిపించిన మమత

ఎన్నికల ఫలితాల సరళి ఎలా ఉంటుంది, ఏయే పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు? అనే విషయాలను వివిధ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటాయి. రాజకీయ నేతలు కూడా వీటిపై తమ అంచనాలను వెల్లడిస్తుంటారు. తాజాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లోక్ ఎన్నికలకు సంబంధించి జోస్యం చెప్పారు.

200 సీట్లకు మించి బీజేపీ గెలవలేదని ఆమె అన్నారు. ఇంకా చెప్పాలంటే కనిష్ఠంగా 135 సీట్లకే పరిమితం కావచ్చని చెప్పారు. కోల్ కతాలో టీఎంసీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆమె మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికల ఫలితాలపై రూపొందించిన ఓ నివేదికను చదివి వినిపించారు. ఈ నివేదిక ప్రకారం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని మొత్తం 193 లోక్ సభ స్థానాల్లో బీజేపీకి కేవలం 5 నుంచి 10 మాత్రమే సీట్లు వస్తాయని చెప్పారు.

More Telugu News