sunder pichai: చైనా మిలటరీకి కాదు.. అమెరికా భద్రతకే నేను కట్టుబడి ఉన్నా: గూగుల్ సీఈవో పిచాయ్ స్పష్టీకరణ

  • చైనాకు లబ్ధి చేకూర్చేలా గూగుల్ పని చేస్తోందంటూ యూఎస్ జాయింట్ చీఫ్స్ ఛైర్మన్ వ్యాఖ్య
  • ఇదే విధంగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్
  • అమెరికానే తమకు ముఖ్యమని చెప్పిన సుందర్ పిచాయ్

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చైనా మిలటరీని పరోక్షంగా బలపరుస్తున్నారంటూ గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సంచలనాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తో పిచాయ్ భేటీ అయ్యారు. తాను అమెరికా భద్రతకే పూర్తిగా కట్టుబడి ఉన్నానని ట్రంప్ కు స్పష్టం చేశారు.

దీనిపై ట్రంప్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'వైట్ హౌస్ లో సుందర్ పిచాయ్ తో ఇప్పుడే మాట్లాడా. ఆయన తన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. చైనా మిలటరీ కోసం కాకుండా అమెరికా మిలటరీ కోసం తను పూర్తిగా కట్టుబడి ఉన్నానని స్పష్టంగా చెప్పారు' అని ట్వీట్ చేశారు. ఇటీవల అమెరికా జాయింట్ చీఫ్స్ ఛైర్మన్ జోసెఫ్ డన్ ఫోల్డ్ మాట్లాడుతూ, చైనాకు లబ్ధి చేకూరేలా గూగుల్ పని చేస్తోందంటూ ఆరోపించారు.

More Telugu News