jagan: జగన్ సభలో అపశ్రుతి.. గోడ కూలి 20 మందికి గాయాలు.. పలువురి పరిస్థితి విషమం.. వీడియో చూడండి

  • తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జగన్ ప్రచారం
  • కుప్పకూలిన పిట్టగోడ
  • గాయపడినవారిలో మీడియా సిబ్బంది కూడా ఉన్నట్టు సమాచారం
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఈరోజు వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వైసీపీ అభిమానులు సభకు హాజరయ్యారు. రోడ్డు కిక్కిరిసి పోవడంతో పాటు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలపై భారీ సంఖ్యలో అభిమానులు నిలబడ్డారు. అయితే, ఊహించని విధంగా ప్రచారసభలో అపశ్రుతి చోటు చేసుకుంది. పక్కనే ఉన్న ఓ భవనం పిట్టగోడ కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 20 మందికి గాయాలైనట్టు సమాచారం. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.  గాయపడిన వారిలో మీడియా సిబ్బంది కూడా ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
jagan
mandapeta
wall
collapse
injuries
ysrcp

More Telugu News