gudivada: డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నేతలు

  • గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ ద్విచక్ర వాహన ర్యాలీ
  • ర్యాలీకి వచ్చిన వారికి డబ్బులు పంచిన వైసీపీ నేతలు
  • మండిపడుతున్న ఇతర రాజకీయ పార్టీలు
ద్విచక్ర వాహనాల ర్యాలీకి వచ్చిన వారికి డబ్బులు పంచుతూ వైసీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో వైసీపీ ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా ర్యాలీకి వచ్చిన వారికి వైసీపీ నేతలు డబ్బులు పంచారు. ఈ వ్యవహారం కాస్తా కెమెరా కంటికి చిక్కింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. మరోవైపు, డబ్బుతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ వైసీపీపై ఇతర రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
gudivada
two wheeler
rally
ysrcp
cash
distribution

More Telugu News