police officers: పోలీసు అధికారుల బదిలీ రాజకీయ కుట్ర: మండిపడుతున్న టీడీపీ

  • బీజేపీ-వైసీపీలు కలిసి చేసిన పని
  • దీనిపై న్యాయ పోరాటం చేస్తాం
  • ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై టీడీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. బీజేపీ-వైసీపీ రాజకీయ కుట్రగా దీనిని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం, ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు.

వైసీపీ, బీజేపీలు తెచ్చిన ఒత్తిడికి ఈసీ లొంగిపోయి నిర్ణయం తీసుకుందని ధ్వజమెత్తారు. అధికారులపై ఫిర్యాదు వచ్చినప్పుడు వివరణ కోరుతారని, వైసీపీ ఫిర్యాదు చేయడమే తరువాయి ఏకపక్షంగా చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. కడప ఎస్పీని బదిలీ చేయడం అంటే వివేకా హత్య కేసు విచారణను పక్కతోవ పట్టించడమేనని విమర్శించారు. ఎన్నికల సంఘం, బీజేపీ, వైసీపీ కలిపి చేసిన కుట్రను ప్రజల్లోకి తీసుకువెళతామని, ఈసీ చర్యపై న్యాయ పోరాటం కూడా చేస్తామని పేర్కొన్నారు.

More Telugu News