Chandrababu: నంద్యాలను ప్రత్యేక జిల్లా చేస్తా: చంద్రబాబు

  • నంద్యాలకు ఔటర్ రింగు రోడ్డు వేస్తాం
  • కుప్పం కంటే ఎక్కువ మెజార్టీ నంద్యాలలో రావాలి
  • మోదీ మరోసారి ప్రధానైతే ముస్లింలను బతకనివ్వరు
ఎన్నికలు అయిపోయిన వెంటనే నంద్యాలను ప్రత్యేక జిల్లా చేస్తానని, స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. నంద్యాలలో రోడ్ షోను ఆయన నిర్వహించారు. నంద్యాలకు ఔటర్ రింగ్ రోడ్డును వేస్తామని చెప్పారు. నంద్యాలను గుండెల్లో పెట్టుకుంటానని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పం కంటే నంద్యాలలో టీడీపీకి ఎక్కువ మెజార్టీ రావాలని అన్నారు. ఎస్పీవై రెడ్డి టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. మోదీ మరోసారి ప్రధాని అయితే ముస్లింలను బతకనివ్వరని చెప్పారు. గోద్రాలో ముస్లింలను ఊచకోత కోశారని అన్నారు. మైనార్టీలకు విదేశీ విద్య సాయం రూ. 25 లక్షలకు పెంచుతున్నామని తెలిపారు. దుల్హన్ పథక సాయాన్ని రూ. లక్షకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇమామ్, మౌజమ్ ల వేతనాలను పెంచుతామని చెప్పారు.
Chandrababu
nandyal
Telugudesam
modi

More Telugu News