Vijayawada: కాపుల రిజర్వేషన్లపై అడిగితే ముష్టివేసినట్టు రూ.10 వేల కోట్లు ఇస్తామన్నారు: జగన్ పై వంగవీటి రాధా ఆగ్రహం

  • జగన్ కు చిత్తశుద్ధిలేదు
  • కాపులపై చర్చకు అవకాశం ఇవ్వలేదు
  • ఎన్నికల్లో బుద్ధి చెప్పాలంటూ పిలుపు
ఇటీవలే టీడీపీలో చేరిన విజయవాడ రాజకీయనేత వంగవీటి రాధా వైసీపీ అధ్యక్షుడు జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీలో ఉన్నప్పుడు కాపుల కోసం ఎంత తాపత్రయపడినా జగన్ అంగీకరించలేదని అన్నారు. కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లపై హామీ ఇవ్వాలంటూ కోరితే ముష్టి పడేసినట్టు రూ.10,000 కోట్లు ఇస్తామని చెప్పాడని ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో కాపులు జగన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కాపుల సంక్షేమం గురించి చర్చిస్తానంటే వద్దన్నాడని, కాపుల రిజర్వేషన్లపై స్పందించాలని కోరితే కుదరదన్నాడని రాధా మండిపడ్డారు. కాపుల భవిష్యత్ పై జగన్ కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్న విషయం ఆనాడే తెలిసిందని అన్నారు. కాపుల గురించి జగన్ కు అసలు శ్రద్ధే లేదని విమర్శించారు.
Vijayawada
Telugudesam
YSRCP
Jagan

More Telugu News