Andhra Pradesh: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన భార్య సౌభాగ్యమ్మ!

  • మాకు ఏపీ పోలీసుల విచారణపై నమ్మకం లేదు
  • మూడో పార్టీ లేదా సీబీఐతో విచారణ జరిపించండి
  • ఈరోజు మధ్యాహ్నం పిటిషన్ ను విచారించనున్న హైకోర్టు

వైసీపీ సీనియర్ నేత వైఎస్ వివేకానందరెడ్డిని గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే వైఎస్ వివేకా మరణంపై అధికార, విపక్షాల మధ్య విమర్శల దాడి సాగుతున్న నేపథ్యంలో ఆయన భార్య సౌభాగ్యమ్మ ఈరోజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని సౌభాగ్యమ్మ పిటిషన్ లో తెలిపారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లేదా మూడో పార్టీతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం మరికాసేపట్లో విచారణ చేపట్టనుంది. మరోవైపు ఈ కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

More Telugu News