మల్లాపూర్ చక్కెర కర్మాగారాన్ని మూసేశారు.. టీఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెబుతారు!: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి
- పసుపుబోర్డు విషయంలో మాటతప్పారు
- రోళ్లవాగు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచలేదు
- జగిత్యాలలో మీడియాతో కాంగ్రెస్ నేత
గత ఐదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని జీవన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయానికి బడ్జెట్ లో రూ.800 కోట్లు కేటాయించినా, కనీసం 8 రూపాయలు కూడా ఖర్చు చేయడం లేదని ఎద్దేవా చేశారు. సమైక్య రాష్ట్రంలో పసుపు క్వింటాల్‌కు రూ.1500 ఇచ్చేవారని గుర్తుచేశారు. రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణలో భాగంగా 0.25 టీఎంసీల సామర్థ్యమున్న ప్రాజెక్టును 1 టీఎంసీకి పెంచుతామని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.